చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేదవ్యాస్
కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత బూరగడ్డ వేద వ్యాస్ ఈరోజు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వచ్చిన ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు. వేదవ్యాస్ కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలను టీడీపీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని ఈ సందర్భంగా వేదవ్యాస్ పేర్కొన్నారు.